ఫేస్ బుక్‌లో మిత్రులు, బంధువుల పోస్టులను చూస్తూనే ఉంటాము. ఈ తరహ లోనే వార్తలు కూడా రానున్నాయి. ఈ వార్తలను ఫేస్బుక్ అధికారికంగా తెస్తున్న ప్రత్యేక ఫీడ్ ట్యాబ్‌లో ఉంచబోనునది. దీనికి సంబంధించిన అప్డేట్ కొన్ని రోజుల్లో ప్రకటించనుంది.
న్యూస్ కార్ప్ నుంచి వార్తలను వచ్చేలా చర్యలు తీసుకోనుంది. న్యూస్ కార్ప్ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందినది. వాల్ స్ట్రీట్ జర్నల్ తో ఒప్పందం కుదిరినట్టు ఫేస్ బుక్ కంపెనీ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. న్యూస్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ థామ్సన్ మాట్లాడుతూ జర్నలిజం విలువను గుర్తించి వార్తలు రానున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌కు క్రెడిట్ దక్కుతుందని చెప్పారు.
ఏయేవార్తలు టాప్‌లో ఉండాలో ఒక బృందం నిర్ణయిస్తుంది. ఫేక్ న్యూస్‌కి ఫేస్బుక్లో అడ్డుకట్ట వేయడానికి అధికారిక వార్తాసంస్థల ద్వారా వార్తలు అందేలా ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా వార్తాసంస్థలకు వినియోగదారులు తగ్గుతున్న నేపథ్యంలో ఇది పరిష్కార మార్గం అని నిపుణులు చెప్తున్నారు.