Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ చిత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని విడుదలైన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘విశ్వరూపం’ విడుదలైన కొన్ని నెలల్లోనే ‘విశ్వరూపం 2’ చిత్రాన్ని విడుదల చేయాలని కమల్ భావించాడు. అయితే ఏవో కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాుగా ‘విశ్వరూపం 2’ చిత్రం విడుదలకు నోచుకోకుండా అలాగే పడిఉంది.
ఎట్టకేలకు ఆ సినిమాను ప్రముఖ తమిళ నిర్మాత బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ తమిళ మీడియా సంస్థలో వార్తలు వచ్చాయి. తమిళం మరియు తెలుగులో ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయని కూడా వార్తలు వచ్చాయి. దాంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా ‘విశ్వరూపం 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం గుప్పుమంది. దాంతో తెలుగు, తమిళంకు చెందిన కమల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. అయితే అవన్ని ఫేక్ వార్తలు అని, ‘విశ్వరూపం 2’కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయబోవడం లేదని, చిత్రాన్ని విడుదల చేసేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కమల్ పేర్కొన్నాడు.