Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వారం రోజుల క్రితం రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేటికెట్’ చిత్రంలో రెండు ప్రమాదాలు జరిగాయని, మొదటి ప్రమాదంలో రవితేజకు గాయాలు అయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి. రెండు రోజుల తర్వాత హీరోయిన్ మాళవిక శర్మకు చిన్న ప్రమాదం సంభవించి స్వల్ప గాయాలు అయ్యాయి అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ రెండు ప్రమాధాలు కూడా నిజం కాదని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అటువంటి వార్తలే ఎన్టీఆర్ విషయంలో వస్తున్నాయి. ఎన్టీఆర్‌కు చిన్న ప్రమాదం జరిగిందని, అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటూ ఎన్టీఆర్ సన్నిహితులు తేల్చి చెప్పారు.
రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం కోసం ఎన్టీఆర్, చరణ్‌లు ఇటీవలే పది రోజుల ప్రత్యేక శిక్షణ కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్‌కు చిన్న ప్రమాదం సంబవించిందని, ఆ ప్రమాదంలో ఎన్టీఆర్ తృటిలో తప్పించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అసలు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం నిజం కాదని కొందరు వాదిస్తుండగా, తాజాగా ఎన్టీఆర్ పీఆర్టీం ఒక క్లారిటీతో మీడియా ముందుకు వచ్చింది. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎన్టీఆర్‌కి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. అంటూ చెప్పుకొచ్చారు. అమెరికా వెళ్లిన విషయంపై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు. అతి త్వరలోనే త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు.