Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో మోస్ట్ ట్యాలెంటెడ్ దర్శకుల్లో త్రివిక్రమ్ కూడా ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా ఆయన సినిమాల సంఖ్య, సక్సెస్‌ల సంఖ్య ఆయన ఎలాంటి సినిమాలను తీశాడో చెప్పకనే చెబుతాయి. ఇది త్రివిక్రమ్ సినిమా అంటూ ఒక మార్క్‌ను ఏర్పాటు చేసుకున్న ఆయన తాజాగా పవన్‌తో తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’తో అందరికి షాక్ ఇచ్చాడు. ఒకటి రెండు డైలాగ్స్ మినహా ఎక్కడ కూడా ఆయన పదునైన డైలాగ్స్, పంచ్‌లు, ఆయన మార్క్ ఎమోషనల్ డైలాగ్స్ కనిపించలేదు. ఇక ఆయన మార్క్ స్క్రీన్‌ప్లే కూడా అజ్ఞాతవాసిలో కనిపించలేదు. అసలు ఇది పవన్ సినిమా కాదేమో అనే అనుమానం కూడా కొందరిలో కలుగుతుంది అంటే త్రివిక్రమ్ ఏ రేంజ్లో తన ప్రతిభను పక్కదారి పట్టించాడో అర్థం అవుతుంది.
ట్యాలెంటెడ్ దర్శకుడు అయిన త్రివిక్రమ్ ఎందుకు ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని ఇలా తీశాడు అంటే చాలా మంది చాలా రకాల సమాధానలు చెబుతున్నారు. అందులో కామన్‌గా, ఎక్కువగా వినిపిస్తున్న సమాధానం… పవన్ కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టడంతో పాటు, పవన్‌ను ప్రేక్షకులు కోరుకున్న విధంగా ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో కథ మరియు స్క్రీన్‌ప్లే విషయంలో పట్టు కోల్పోయాడు. అవును ఈ విషయం నూటికి నూరు పాల్లు నిజమే. పవన్ నుండి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ను ఆశిస్తున్నారు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లేలో ఎంటర్టైన్మెంట్ను జోడివ్వడం జరిగింది. కాని అజ్ఞాతవాసి ఒక సీరియస్ రివేంజ్ డ్రామా. రివేంజ్ తీర్చుకునేందుకు తన ఆఫీస్‌లోకి ఒక ఎంప్లాయిగా వెళ్లిన హీరో అక్కడ చిల్లర వేశాలు వేస్తూ కామెడీ చేయడం ఏ ఒక్కరికి నచ్చలేదు.
‘అతడు’ సినిమా కూడా సీరియస్ మూడ్‌తో నడవాల్సిన కథ. అయితే అందులో చిల్లర కామెడీ లేకుండా ఆరోగ్యవంతమైన కామెడీ ఉంది. అందుకే ఆ సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకులకు నచ్చింది. ఖలేజా చిత్రం సీరియస్ పాయింట్‌తో సాగిపోయే కథ. కాని దాంటో కూడా మహేష్‌తో చిల్లర కామెడీ చేయించాడు. దాంతో సినిమా దొబ్బింది. ఖలేజా తర్వాత త్రివిక్రమ్ మళ్లీ అలాంటి చిల్లర కామెడీ చేయడు అని అంతా భావించారు. కాని అజ్ఞాతవాసిలో మళ్లీ అదే కామెడీతో ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. పవన్ వంటి స్టార్‌తో జబర్దస్త్ కామెడీ చేయించడం ఏంటీ సార్ అంటూ ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.
పవన్‌తో పవర్ ఫుల్ పంచ్‌లు, పెద్ద డైలాగ్‌లు చెప్పిస్తే బాగుంటుంది కాని, శాకుంతల అక్కయ్య అంటూ లేడీలా కామెడీ చేయించడం ఏంటీ త్రివిక్రమ్ గారు. మీ తర్వాత సినిమాలకు అయినా ఇలాంటి చిల్లర కామెడీని వాడకండి, ఎన్టీఆర్ వంటి మాస్ పవర్ ఫుల్ హీరోతో కామెడీ చేయించాలని తప్పులో కాలు వేయకండి. మీ నుండి ఎన్నో మంచి సినిమాలు ఆశిస్తున్నాం. మద్యలో మిడిల్ డ్రాప్ అవ్వకండి త్రివిక్రమ్ గారు.