Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సెలబ్రెటీలు కొన్ని సందర్బాల్లో వారి స్టార్ స్టేటస్ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా జనాల్లోకి వెళ్లిన సమయంలో కొందరు చేసే పనుల కారణంగా అసౌకర్యంకు గురి అవ్వాల్సి వస్తుంది. ఇలా పలువురు హీరోయిన్స్ పలు సందర్బాల్లో అభిమానుల చేతుల్లో నలిగి పోవడం లేదా మరో విధంగా ఇబ్బంది పడటం జరిగింది. తాజాగా ఆ జాబితాలోకి ఇలియానా చేరింది. తాజాగా హిందీలో ఆమె నటించిన ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక కార్యక్రమంకు ఆమె హాజరు అయ్యింది. ఆ సందర్బంగా అభిమానులం అంటూ కొందరు ఆమెను శారీరకంగా ఇబ్బంది పెట్టారట.
ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అభిమానం ఇంతగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, వారు అభిమానులు కాదు, అలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం జరిగింది అనే విషయం పూర్తిగా చెప్పకున్నా ఆమె మాటల్లో విషయం అర్థం అవుతుంది. ఎన్ని విధాలుగా ఆమెను వారు వేదించారో ఆమె మాటల్లో వేదనను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇలియానా బాలీవుడ్లో ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తుండగా, సౌత్‌లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. కాని ఇప్పట్లో సౌత్ సినిమాలను ఒప్పుకోవాలని భావించడం లేదు అంటూ చెబుతుంది.
మరిన్ని వార్తలు: