Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక భాష చిత్రాలు మరో భాషలో విడుదల కావడం సర్వ సాదారణం. ఒక భాషలో సక్సెస్ అయిన చిత్రాలను మరో భాషలో విడుదల చేస్తూ ఉంటారు. అయితే వేరే భాషలో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఇక్కడ ఆ హీరోకు గుర్తింపు ఉంటేనే సినిమా అమ్ముడు పోతుంది. ఉదాహరణకు తమిళంలో కార్తీ లేదా సూర్య, విశాల్ ఇలా ఎవరైనా నటించిన సినిమాలు తెలుగులో అమ్ముడు పోతాయి. కారణం వారు తెలుగులో సుపరిచితులు. అలా కాదని తమిళంలో సక్సెస్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు తెలుగులో విడుదల కావు. అలాగే మలయాళంలో తెరకెక్కి సక్సెస్ అయిన సినిమా ‘కాళి’.
మలయాళంలో దాదాపు 25 కోట్ల వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ సక్సెస్ను దక్కించుకున్న ‘కాళి’ చిత్రంలో హీరో దుల్కర్ సల్మాన్. ఆ హీరోకు తెలుగులో పెద్దగా క్రేజ్ లేదు. దాంతో ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సాయి పల్లవి తాజాగా ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. మొదటి సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను పిచ్చ పిచ్చగా ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కింది. ఆ కారణంగానే ఆమె నటించిన ‘కాళి’ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసేందుకు నిర్మాతలు సిద్దం అయ్యారు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను పంపిణీ చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. మొత్తానికి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో ఎదిగి పోయింది కదా..!
మరిన్ని వార్తలు:
మరోసారి బిగ్బాస్ రూల్స్ బ్రేక్
టాప్ చిత్రాల జాబితాలో ఫిదా
పవన్ సినిమాల పరిస్థితి ఏంటి?