Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా దుమ్ముదుమ్ముగా కలెక్షన్స్ వసూళ్లు చేసింది. మొత్తంగా 50 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ సాధించినట్లుగా ట్రేడ్ పండితుల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మాటీవీ భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసింది.
తెలంగాణ సాంప్రదాయాలను చక్కగా చూపించిన ‘ఫిదా’ సినిమాను తెలంగాణ రాష్ట్ర పండుగా అయిన బతుకమ్మ సందర్బంగా మాటీవీలో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా కనీసం వంద రోజులు కూడా కాకుండానే విడుదల కాబోతుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు. సాయి ప్లవి నటనతో ఫిదా చేయడంతో వెండి తెరపై కాసుల వర్షం కురిసింది. మరి బుల్లి తెరపై టీఆర్పీరేటింగ్ బద్దలు అవుతుందో చూడాలి.