జీఎస్టీ దెబ్బకి సినిమా ఇండస్ర్టీ ఒక్కసారిగా కుదేలయింది. మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీఎస్టీ తట్టుకోలేక తట్టాబుట్టా సర్దేసిన చిన్న నిర్మాతలెంతో మంది. ముఖ్యంగా టాలీవుడ్, దక్షిణాది ఇతర భాషల సినీ పరిశ్రమలో ఈ సమస్య అధికంగా కనిపించింది. అప్పట్లో దీనిపై ఫిలిం వర్గాల్లో జోరుగా చర్చలు సైతం జరిగాయి. అదనపు ఛార్జీల మోతతో సామాన్యుడు సినిమా కెళ్లాలంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. తాజాగా 2019 మధ్యంతర బడ్జెట్ లో సినిమా రంగానికి వరాలు ఇచ్చినట్టు అనిపిస్తోంది.
పైరసీని అంతమొందించేందుకు సినిమాటోగ్రపీ యాక్ట్ కింద యాంటీ క్యామ్ కార్గింగ్ ప్రోవిజన్, సింగిల్ విండో క్లియర్స్ ఇచ్చిన కేంద్రం ఈ రెండింటినీ సినిమాటోగ్రపీ చట్టానికి జయ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ సింగిల్ విండో క్లియరెన్స్ విదేశీ చిత్రాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు భారతీయ చిత్రాలన్నింటికీ వర్తింపజేసింది. ఇకపై ఈ విధానం ద్వారా ఇతర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోవడానికి ఏ సినిమాకైనా త్వరిగతిన అనుమతులు లభించనున్నాయి. అలాగే సినిమా టిక్కెట్లపై జీఎస్టీని తగ్గించారు. రూ100 టిక్కెట్ పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి , రూ 100 మించిన టిక్కెట్ ధరపై 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు.