బద్ధలైన బారికేడ్లు.. ఆ మాజీ ఎమ్మెల్యే కొడుకు పై కేసు

కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతంది. అదే సమయంలో ప్రజలు నిబంధనలను ఉల్లింఘించి రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్ లోని బిలాస్‌పూర్ జిల్లా పోలీస్ స్టేషన్ లో లాక్ డౌన్ ఉల్లంఘన కేసు నమోదైంది.

తాజాగా కరోనా వైరస్ కారణంగా విధించిన కర్ఫ్యూ సమయంలో పోలీసులు ఘోమాని చౌక్‌ పోస్ట్ వద్ద తనీఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై ఒక కారు వేగంగా రావడాన్ని గమనించిన పోలీసులు.. కారు డ్రైవర్‌ను ఆపమని పోలీసులు సైగ చేశారు. అతను అవేం పట్టించుకోకుండా.. వేగంగా బారికేడ్‌ను పగలగొట్టి తప్పించుకున్నాడు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కారు మాజీ ఎమ్మెల్యే కుమారుడిదని తెలుస్తోంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత చర్యలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారని డీఎస్పీ రాజేంద్ర జస్వాల్ స్పష్టం చేశారు. పోలీసులు ఐపిసి సెక్షన్ 186,188, 34 కింద కేసు నమోదు చేసి అందుకు సంబంధించి దర్యాప్తును చేపడుతున్నారు. నిందితుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.