అస్సాంలో ఘోరం చోటుచేసుకుంది. అస్సాంలోని ఇంధన బావిలో మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో కలకలం రేగుతోంది. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఈరోజు చనిపోయినట్లు గుర్తించారు. గత 14 రోజుల నుంచి టున్సుకియా జిల్లాలో ఉన్న ఓ ఇంధన పైపు లైన్ నుంచి గ్యాస్ లీకవుతూనే ఉంది. దీంతో మొదట ఇద్దరు ఫైర్ సిబ్బంది మాయమయ్యారు. ఆ తర్వాత వారి భౌతిక దేహాలను అధికారులు గుర్తించారు. భారీ స్థాయిలో ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ మంటలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద సుమారు 1.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంటల్ని ఆర్పేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.