పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో(Gulzar House) మే 18వ తేదీ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతిచెందారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. 17 మంది మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


