దేశాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి కరోనా. దీని దెబ్బకు దేశం గడగడలాడుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 149గా నమోదయ్యాయి. నిన్న ఒకే రోజే 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వత్రా కలకలం రేపుతోంది.
అదేవిధంగా…. ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడలోని భవానీపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. తొలి కరోనా మరణం సంభవించడంతో ప్రభుత్వం మరింత అలెర్ట్ అయింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి వచ్చాడు. అయితే.. ఆ వ్యక్తి తండ్రికి కరోనా సోకి మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు కేసులు ఎక్కువగా నమోదైన నూజివీడు, జగ్గయ్యపేటల్లో కూడా రెడ్ జోన్లగా ప్రకటించాయి. కాగా భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేటలో కర్ఫ్యూ విధించి పటిష్టమైన నిఘా పెట్టారు.