అమ్మగా నిత్య లుక్‌కు తంబీలు దాసోహం…!

Nithya Menen Gets Candid About Jayalalitha Biopic

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లు తమిళంలో పలు తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ‘ది ఐరెన్‌ లేడీ’. అమ్మ యొక్క గొప్పదనంను అద్బుతంగా చాటేందుకు ఈ చిత్రంను దర్శకుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆమె సినీ కెరీర్‌ మరియు రాజకీయ కెరీర్‌ మొత్తంను తన సినిమాలో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిత్యామీనన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.తాజాగా నిత్యామీనన్‌కు సంబంధించిన లుక్‌ రివీల్‌ అయ్యింది. నిజంగా అమ్మ జయలలితలాగే నిత్యామీనన్‌ ఉంది అంటూ టాక్‌ వినిపిస్తుంది.

iron-lady

అమ్మ రాజకీయాల్లో అడుగు పెట్టిన సమయంలో ఎలా అయితే ఉండేదో నిత్యామీనన్‌ లుక్‌ అలాగే ఉందని, తప్పకుండా అమ్మ పాత్రలో నిత్య జీవిస్తుందనే నమ్మకంను తమిళ తంబీలు వ్యక్తం చేస్తున్నారు. అద్బుతమైన పాత్రలో అనిర్వచినీయంగా ఉందని తమిళ తంబీలు ఈమె లుక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. అతి త్వరలోనే సినిమా కూడా రాబోతుంది. నిత్యామీనన్‌ ఈ పాత్ర కోసం లావు పెరిగిన విషయం తెల్సిందే.