చేప నీరు తాగుతుంది. అలాంచి విచిత్రంగా చేప బీరు తాగడం అంతటా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడూ నీటిలో ఉండే చేపలు నీరు తాగుతాయా? అని అడిగితే చాలామంది డౌట్ గానే అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఎందుకంటే ఉప్పునీటి చేపలు నీళ్లు తాగుతాయి. అదే మంచి నీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు. కానీ.. ఓ చేప ఏ జాతికి చెందినదో తెలియదు కానీ… మనుషులు తాగే బీర్‌ను గుటగుటా తాగేసింది.
అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 33 సెకన్లు నిడివి గల ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అది ఎక్కడ ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే… బ్రెజిల్‌లోని సముద్రంలో ఓ వ్యక్తి షికారు కెళ్లాడు. అక్కడంతా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండడంతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఓ చేప అతని పడవ ఎక్కి కూర్చుంది. అదే టైంలో అతను అతను చేతిలో బీర్ సీసా పట్టుకొని తాగుతున్నాడు. అసలు చేప బీర్ తాగుతుందో లేదో అని టెస్ట్ చేసేందుకు బాటిల్‌ను చేప ముందుంచాడు. అంతే… ఆ చేప ముందు బీరు బాటిల్ పెట్టీ పెట్టగానే ఉరికంచే ఉత్సాహంతో ఆ చేప మనిషికంటే వేగంగా బీర్ మొత్తం లాగించేసింది. ఈ వీడియోను చూసిన వారంతా ముక్కుమీద వేలేసుకోవడం వారి వంతు అయింది. అంతా ఆశ్చర్యపోయేలా ఈ భూమిపై ఉన్న తాగుబోతులు చాలక.. ఇప్పుడు నీటిలో జీవించే చేపలు కూడా బీరు తాగిస్తుంటే ఎలా అంటూ కొంతమంది స్పందిస్తుంటే… ఈ బీరు చేపలకు హానికరం అంటూ మరికొంతమంది రెస్పాండ్ అవుతున్నారు.