దేశమంతా ఇప్పడు ఢిల్లీలోని నిజాముద్దీన్ మత ప్రార్థనలకు హాజరైన వారిపైనే దృష్టి పెట్టింది. దాదాపు వేల మంది వివిధ రాష్ట్రాలను అక్కడ ప్రార్థనలకు హాజరై వారి ఇళ్లకు హాజరయ్యారు. ఇప్పుడు ఆ ప్రార్థనలకు హాజరైన వారిపైనే ప్రభుత్వం గురిపెట్టింది. సుమారు 70 మంది జిల్లా ఒక్క గుంటూరు జిల్లా నుంచి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 19వ తేదీన వీరంతా జిల్లాకు చేరుకున్నారు. అయితే అప్పటి నుంచి వీరు ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరెవరిని కలిశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారితో సన్నిహితంగా 134 మంది ఉన్నట్లు తేల్చారు. వారిలో 90మందిని గుర్తించి ఒక్క సోమవారం రోజే 80మందిని క్వారంటైన్ కేంద్రాలను తరలించడం జరిగింది.
అయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మత ప్రార్థనలకు వెళ్లిన వచ్చి క్వారంటైన్‌కు తరలించిన వారి శాంపిళ్లు సేకరించి టెస్టింగ్ కు పంపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, మాచర్ల ప్రాంతాల్లో కరోనా బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో వైద్య సేవలు అందిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాలలో వసతుల కల్పన బాధ్యతలను డీఆర్డీఏ పీడీ యుగంధర్‌కు అప్పగించారు. కరోనా అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే బాధ్యతను డ్వామా పీడీ గజ్జల శ్రీనివాసరెడ్డి చూస్తున్నారు.
అదేవిధంగా కరోనా అనుమానితులను గుర్తించడం, విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు.. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిపైన నిఘా పెట్టారు. వారిలో కొంత మందిని హోం క్వారంటైన్‌తోపాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలలో.. ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. కరోనా కోరల్లో జిల్లా ప్రజలు చిక్కుకోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం.
అంతేకాకుండా ప్రస్తుతం జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా బాధ్యతలు నిర్వహిస్తూ.. 16 స్పెషల్ టీం ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన సూచనలు చేశారు.