వైద్యుల సలహాలను తప్పకుండా పాటించండి

వైద్యుల సలహాలను తప్పకుండా పాటించండి

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలకు చెందిన వ్యక్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వైద్యుల సూచనలు, సలహాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ఇది తినొద్దు, అది చేయొద్దు లాంటి సలహాలను చాలా మంది ఇస్తారని… మరికొందరు పలానాది తింటే కరోనా రాదని చెబుతారని… ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోవద్దని అన్నారు. మీరు ఏది కావాలనుకుంటే అది చేయండి… కాకపోతే వైద్యుల సలహా మేరకు దాన్ని చేయండి’ అని తెలిపారు. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకితే ఇంట్లో అందరికీ అది సోకే అవకాశం ఉందని.. అందువల్ల అందరూ మాస్కులు ధరించాలని, చేతికి గ్లోవ్స్ వేసుకోవాలని, ఇతరులకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు.

కోవిడ్ 19 వ్యాప్తి, వైరస్‌ను నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి బీఎస్ఎన్ఎల్, జియో ద్వారా ప్రీ-కాల్ అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించనున్నట్టు కేంద్రం తెలిపింది. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిన ఇద్దరు వ్యక్తులకు చికిత్స కొనసాగుతోంది. వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడటంతో తక్షణమే బయోమెట్రిక్ హాజరును రద్దుచేశారు. మార్చి 31 వరకు రెండు జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.