సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘెర పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తన పదవికి రాజీమానా చేసిన విషయం తెలిసిందే. ఇపుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ రాహుల్ బాటనే ఎంచుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు హరీశ్ రావత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అసోంలో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవడంతో..నైతిక బాధ్యత వహిస్తూ అసోం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసోంలో మొత్తం 14 లోక్ సభ స్థానాలకుగాను కాంగ్రెస్ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది.