గుళ్ల చుట్టూ తిరుగుతున్నారని చేసిన ఆరోపణలు బాదించాయి

గుళ్ల చుట్టూ తిరుగుతున్నారని చేసిన ఆరోపణలు బాదించాయి

గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారంటూ కొంత మంది తనపై చేసిన ఆరోపణలు ఎంతగానో బాధించాయని వాపోయారు మాజీ గవర్నర్‌ నరసింహన్. విభజన సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నారు. గవర్నర్‌గా తొమ్మిదిన్నరేళ్ల పాటు తాను నిర్వర్తించిన బాధ్యతలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో మధుర జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయని కితాబిచ్చారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వలేదని కితాబిచ్చారు మాజీ గవర్నర్‌ నరసింహన్. శేష జీవితాన్ని చెన్నైలో సాధారణ వ్యక్తిగా గడుపుతానని చెప్పారు. గవర్నర్ పదవి కంటే ముందే ఎలా జీవితాన్ని గడిపానో అటువంటి జీవినాన్ని మళ్లీ  కొనసాగిస్తానని అన్నారు . ఇక తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు నియామక పత్రం అందింది. ఈ మేరకు ఢిల్లీ తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి చెన్నైలో తమిళిసైను కలిసి నియామక పత్రం అందజేశారు. ఆమె సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణకు తొలి మహిళా గవర్నర్‌. ఆమె 1961లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో జన్మించారు. తండ్రి కుమరి అనంతన్‌ కాంగ్రెస్‌ నేత కావడం విశేషం. తమిళనాట వైద్యసేవల రంగం నుంచి ఆమె ప్రముఖ రాజకీయవేత్తగా ఎదిగారు.