ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ టెండుల్కర్. సచిన్, అతని ఆట తీరుని 14 ఏళ్ల వయస్సులోనే గుర్తించి పట్టుబట్టి మరీ తమ క్లబ్ తరఫున ఆడే అవకాశం కలిపించిన వ్యక్తి భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ కాండే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం (సెప్టెంబర్ 22న) మృతి చెందారు. 86 సంవత్సరాల ఈ మాజీ భారత ఆటగాడు ఆదివారం తుది శ్వాస విడిచారు.
ముంబైలోని ప్రఖ్యాత ‘కంగా లీగ్’ పోటీల్లో మాధవ్ ఆప్టే తన డెబ్భైవ ఏటా కూడా ఆడారు.క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షుడిగా పని చేస్తున్నపుడు ఈయన సచిన్ కి అవకాశం ఇచ్చారు .1950వ దశకంలో భారత టెస్టు ఓపెనర్‌గా సేవలందించారు.
1932లో ముంబైలో జన్మించిన మాధవ్ ఆప్టే..ఆరంభంలో లెగ్ స్పిన్నర్‌గా తన కెరీర్ ని ప్రారంభించారు. తరువాత బాట్స్మన్ గ కూడా పనిచేసారు.
1952-53 మధ్య కాలంలో మాధవ్ ఆప్టే టీమిండియా తరఫున ఏడు టెస్టులాడి 542 పరుగులు చేశారు. ఓ శతకం, మూడు అర్ధ శతకాల సాయంతో 49.27 సగటుతో రాణించారు. ఓవరాల్‌గా 67 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆప్టే.. ఆరు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 3,336 పరుగులు చేశారు.