రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ రాదని భావిస్తున్న నేతలు ఫిరాయింపులకు తెరదీసిన నేపథ్యంలో, అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే, మాజీ ఎంపీ, దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ ను టీడీపీ రంగంలోకి దించింది. వాస్తవానికి అమలాపురం టికెట్ ను హరీశ్ కు ఆఫర్ చేయడంతోనే రవీంద్రబాబు పార్టీ మారారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హరీశ్ ను టీడీపీ అధిష్ఠానం ప్రమోట్ చేస్తూ, ఎంపీగా ఉన్న తనను పక్కన పెట్టడంపై రవీంద్ర మనస్తాపంతో ఉన్నట్టు ముందే వార్తలు వచ్చాయి. ఇక రవీంద్రకు గన్నవరం అసెంబ్లీ సీటును జగన్ ఖరారు చేసినట్టు సమాచారం. అమలాపురం నియోజకవర్గంలో బాలయోగి తర్వాత అతనిలో పది శాతం పేరును కూడా తెచ్చుకోలేకపోయారు.
ప్రజల్లో భరోసాని కల్పించలేకపోయారు. దీంతో అతనికి ఈసారి టిక్కెట్ నో అని చెప్పింది అధిష్టానం. ఈ క్రమంలో దివంగత టీడీపీ నేత జీఎంసీ బాలయోగి కుటుంబంపై పార్టీ దృష్టి సారించింది. బాలయోగి తనయుడు హరీశ్ మాథుర్‌ను బరిలో దించాలని తెలుగుదేశం పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. బాలయోగికి ఉన్న క్లీన్ ఇమేజ్, ఆయనపై నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది. నియోజకవర్గానికి బాలయోగి చేసిన సేవలు జనం ఇప్పటికీ మరిచిపోలేదు. బాలయోగి చనిపోయినపుడు అతని కుమారుడ హరీష్ వయసు చాలా తక్కువ. అందుకే అప్పట్లో అతని ఇంట్లో ఎవరూ పోటీ చేయలేదు. ఇపుడు ఆయన కుమారుడు హరీష్ రాజకీయాలకు సిద్ధమవడంతో గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఆయనకే టికెట్ ఇస్తారనే టాక్ నడుస్తోంది. అందుకే రవీంద్రబాబు ముందు జాగ్రత్తగా టీడీపీలో తన బ్యాగు సర్దేసుకున్నారని అంటున్నారు,