ఒక సామన్య మానవుడు లాగా బస్సు కోసం వేదురు చూస్తూన్న ఈయన్ని గుర్తు పట్టారా ? ఒక మాజీ ఎమ్మెల్యే ! అరె ఇదేంటి మాజీ ఎమ్మెల్యే బస్సు ఎక్కటం ఏంటి అని షాక్ అయ్యి, ఆ ఏదో ఫోటోషూట్ కోసమో, వచ్చే ఎలక్షన్ల కోసం మంచి ప్లాన్ వేస్తున్నాడు అనుకుంటున్నారా? కానీ ఈయన కథే వేరండి, మొదటి నుండి ఓ సామాన్యుడిలా ఉండటమే ఆయనకు ఇష్టం. ఇంతకీ అతను ఎవరా అని అనుకుంటున్నారా? ఆయన మన గుంటూరు జిల్లా నుండి కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎన్నికయిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీరపనేని యల్లమందరావు.
మామూలుగా ఈ రోజుల్లో సర్పంచి కూడ కారులో తిరుగున్న రోజులలో అవేమీ పట్టకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తానేంటో, ఎంతటి నిరాడంబరుడో చూపిస్తూనే ఉన్నాడు.
రాజాకీయంగా చైతన్యవంతమైన గుంటూరు జిల్లాలో కీలక స్థానమైన వినుకొండ కి 10 యేళ్లు శాసన సభ్యలు గా సేవలు అందించిన వ్యక్తి అయన ఇప్పటికీ సాధార వ్యక్తి లాగ హంగు ఆర్భాటం లేకుండా ఏక్కడకి వెళ్ళినా RTC బస్ ప్రయణం చేయడం విశేషం. శాసన సభ్యులుగా పనీ చేసే రోజుల్లో కూడా శాసన సభ సమావేశాలు కి RTC బస్సులు ఆటోలు, ట్రైను లో సామన్య మానవుడు లాగా ప్రయాణం చేసేవారు ప్రయాణం లోనే ప్రజలు తో నేరుగా మాట్లాడుతు ప్రజల సమస్యలు తేలుసుకోని వారి సమస్యలు తీర్చేవారు. నేటి రాజకీయనాయకులు లో ఇలాంటి వ్యక్తి చాల అరుదుగా కనిపిస్తారు.