గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

four foods you should eat for better health heart

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. ఇది మన శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. దీంతో అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ప్రస్తుత తరుణంలో అస్తవ్యస్తమైన మన జీవన విధానంతోపాటు పలు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడి చనిపోతున్నారు. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. దీనికి తోడు.. నిత్యం వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి. అలాగే పలు ఆరోగ్యకరమైన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. మరి గుండె సంరక్షణ కోసం నిత్యం మనం తినాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

2. వాల్‌నట్స్‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తింటే వాటిలో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

3. నిత్యం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్ తినాలి. ఓట్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

4. డార్క్ చాకొలెట్లను తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రావు.