పసిఫిక్ సముద్రంలో 7107 దీవులు సముదాయంతో భూమద్య రేఖకు సమీపంగా ఉన్న ఫిలిపిన్స్ లో భూకంప ప్రమాదం మరియు తుఫానుల ప్రమాదం అధికంగా ఉంటుంది.
బుధవారం రాత్రి ఫిలిపిన్స్‌లో భారీభూకంపం సంభవించింది .రిక్టర్స్కేల్‌పై 6.4గా భూకంప తీవ్రత నమోదు అయింది.ఈ భూకంపం వల్ల అధికారులు అలర్ట్ ప్రకటించి భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సహా చర్యలు కొనసాగిస్తున్నారు.
దక్షిణంగా ఉన్న మిండానావో లో భూకంపం కారణంగా నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ భూకంపం తీవ్రత వల్ల ఇళ్లు కూలడంతో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఒక మహిళ తన ఐదేళ్ల కొడుకు కొండచరియలు విరిగిపడడడంతో అక్కడికి అక్కడే చనిపోయారు.