కాయిన్‌ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి

కాయిన్‌ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి

కాయిన్‌ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) తన అవ్వ ఇంటి వద్ద ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.