ఆమె భర్తతో విడిపడి వేరేగా ఉంటోంది, అయితే అప్పటికే కూతురు ఉండగా ఆమెని హాస్టల్ లో పెట్టి చదివిస్తోంది. ఈ క్రమంలో భార్య చనిపోయిన వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతఃర సంబంధంగా మారి అతనితో సహజీవనం మొదలుపెట్టింది. అయితే తాను లేని సమయంలో ఇంట్లో ఉన్న కూతురి మీద సహజీవనం చేస్తున్న వ్యక్తి లైగిక డై చేస్తున్నాడని తెలియడంతో అతన్ని ఎలా అయినా చంపాలని ఫిక్స్ అయ్యింది. అయితే చంపే ముందే అతని ఆర్ధిక సంబందమైన రహస్యాలు తెలుసుకుని మరీ కూతురు కూతురి ఫ్రెండ్స్ సహాయంతో అతన్ని చంపించింది. నిజానికి ఈ హత్య వ్యాపార విభేదాల కారణంగా జరిగి ఉంటుందని పోలీసులు భావించినా, సీసీ కెమెరా రికార్డ్ వారికి అ పక్కనే ఉన్న సదరు మహిళ పై అనుమానం వచ్చేలా చేసింది. ఆ సమయంలో ఆమె నవ్వుతూ ఉండటం, వారిని ఎదిరించే ప్రయత్నంగానీ, వారించే ప్రయత్నం కానీ చేయకపోవడంతో ఆమెనే అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశారు. ఆపై విచారణ చేయగా ఈ వ్యవహరం బయటకి వచ్చింది. తమిళనాడులోని మధురై నటరాజన్ నగర్ లో ఇళంగోవన్ అనే వ్యక్తి ఫైనాన్సియర్. పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అతని భార్య మరణించగా, అప్పటికే పెళ్లై అనూహ్య అనే కుమార్తె ఉన్న అభిరామి అనే మహిళ పరిచయం అయింది. ఆపై ఇద్దరూ అక్కడే ఓ ఇంట్లో సహజీవనం ప్రారంభించారు. అనూహ్య హాస్టల్ లో ఉంటూ అప్పుడప్పుడూ తల్లిని చూసేందుకు వచ్చిపోతుండేది. ఈ క్రమంలో అభిరామి ఇంట్లో లేని సమయంలో అనూహ్య వచ్చింది. అప్పటికే ఆమెపై కన్నేసిన ఇళంగోవన్, అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ విషయాన్ని అనూహ్య, తన తల్లికి చెప్పింది. దీంతో కోపంలో అభిరామి ఇళంగోవన్ ఆస్తి, ఫైనాన్స్ సంస్థల్లో ఉన్న డబ్బులపై దృష్టి పెట్టింది. సన్నిహితంగా ఉంటూనే మట్టుబెట్టాలని ప్లాన్ చేసింది. అందుకు అనుహ్య స్నేహితుడు బాల మురుగన్, అతడి స్నేహితుడి సహకారాన్ని తీసుకుంది. హత్య రోజు సైతం ఇంట్లోని ఉయ్యాలలో ఆయనతో పాటు ఆనందంగా గడిపింది. ఆపై ఇంట్లోకి దూసుకు వచ్చిన బాల మురుగన్, మరో ఇద్దరు దూసుకొచ్చి, ఇళంగోవన్ ను దారుణాతి దారుణంగా అభిరామి కళ్లముందే హత్య చేశారు. సీసీ టీవీ రికార్డులని బట్టి అనూహ్యను, బాలమురుగన్ ను, మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.