మోదీకి విషెస్‌ చెప్పేందుకు సైకిల్‌పై గుజరాత్‌ నుంచి ఢిల్లీకి..

From Gujarat to Delhi on bicycle to wish Modi

మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పేందుకు ఓ బీజేపీ కార్యకర్త గుజరాత్‌ నుంచి ఢిల్లీకి సైకిల్‌పై వచ్చారు. గుజరాత్‌లోని అమ్రేలికి చెందిన బీజేపీ కార్యకర్త ఖిమ్‌చంద్‌ చంద్రాని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు శుభాకాంక్షలు చెప్పేందుకు సైకిల్‌పై ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న మీడియా ఖిమ్‌చంద్‌ చంద్రానిని పలకరించింది. బీజేపీ 300 సీట్లకుపైగా గెలిస్తే..మోదీ, అమిత్‌షాకు విషెస్‌ అందించడానికి సైకిల్‌పై ఢిల్లీకి వస్తానని నిర్ణయం తీసుకున్నా. అందుకోసమే ఢిల్లీకి వచ్చా. సైకిల్‌పై ఢిల్లీ వచ్చేందుకు 17 రోజులు సమయం పట్టింది. ప్రధాని మోదీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశా. మీ ధైర్యసాహసాలు చాలా గొప్పవని ప్రధాని అన్నారు. ఎల్లుండి అమిత్‌ షాను కలిసిన తర్వాత తిరిగి గుజరాత్‌కు వెళతానని ఖిమ్‌చంద్‌ చంద్రాని వెల్లడించారు.