ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్…పక్కా పూరీ మార్క్

ismart shankar trailer
ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్…పక్కా పూరీ మార్క్
ఓ పిల్లా నువ్ ఊ అంటే గొల్కొండ రిపేర్ జేసి నీ జేతుల పెడ్తా.. భేగం చేసి ఖిల్లా మీద గూస‌బెడ్తా..
పిల్లి గుడ్డిదైతే ఎల‌క ఎగిరెగిరి చూపించిందంటా..
అన్నా పోలీసులు నీ డిప్ప‌కు బొక్క పెట్టింర్రంట‌..
దీన్త‌ల్లి నా దిమాక్ ఏందిరా డ‌బుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్కుంది..
నీ జాతిల నా పుల్ల‌..
బొక్క వెట్టుడేందిరా..
నేను జైలు నుంచి త‌ప్పించుకుంది బార్కాస్ బిర్యానీ తిన్నీక గాదు.. యాట కొయ్య‌నీకే.. నా యాట నువ్వే..
ఇలా ఒక‌టా రెండా ట్రైల‌ర్ నిండా బుల్లెట్స్ లా డైలాగులు వ‌దిలేడు పూరీ జ‌గ‌న్నాథ్. రామ్ తో ఈయ‌న చేస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగానే అనిపిస్తుంది. ప‌క్కా హైద‌రాబాద్ బిర్యానీ తిన్న‌ట్లు మాస్ గా ఉంది ఈ ట్రైల‌ర్. ఇక రామ్ కూడా ఇదివ‌ర‌కు ఏ సినిమాలో లేనంత మాస్ గా క‌నిపిస్తున్నాడు. గ‌న్స్, మాఫియా, హీరోయిన్ల అందాలు ఇలా అన్నీ ఈ సినిమాలో కూడా క‌నిపిస్తున్నాయి. పోలీసులు రామ్ బుర్ర‌లో చిప్ పెట్ట‌డం ఒక్క‌టే కధలో ఇంటరెస్టింగ్ పాయింట్. డ‌బుల్ దిమాక్ తో రామ్ ఏం చేసాడనేదే అస‌లు క‌థ‌. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసెయ్యండి మరి.

https://www.youtube.com/watch?v=v8yoBVK2NVg