‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) సినిమా రివ్యూ

‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) సినిమా రివ్యూ

అనేక వివాదాల నడుమ ‘వాల్మీకి’ టైటిల్‌ను ‘గడ్డలకొండ గణేష్‌’గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వరుణ్ తేజ్ పూర్తిగా మాస్ పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.వరుణ్ తేజ్ క్యారెక్టర్ సినిమాలో మరో లెవెల్ కి చేరుకుంది. రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ ఎట్రాక్ట్ చేశాడు. వరుణ్ లోని మాస్ ఎలిమెంట్స్ ను తెరపై చూపించడంలో దర్శకుడు హరీశ్ శంకర్ సక్సెస్ అయ్యాడు. ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపించాడు. బోర్ కొట్టిస్తుంది అనేలోపే డైలాగ్స్ అలాగే పంచ్ లతో మంచి ఎనర్జీని తెప్పించాడు.

ఇక పూజా హెగ్డే న్యాచురల్ యాక్టింగ్ తో తన రేంజ్ కి తగ్గట్టు నటించింది. ముఖ్యంగా వెల్లువచ్చి గోదారమ్మా సాంగ్ ఆమె చూపించిన హావభావాలు శ్రీదేవిని గుర్తు చేస్తాయి. ఆ పాట ఒక మంచి ఫీల్ ని కలిగిస్తుంది. వరుణ్ బాడీ లాంగ్వేజ్ ని దర్శకుడు చాలా బాగా వాడుకున్నాడు అనిపిస్తోంది. గద్దల కొండ గణేష్ గా సరికొత్త కిక్ ఇచ్చాడు.

డైలాగ్స్ డెలివరీ అలాగే నెగిటివ్ షేడ్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. మరో హీరో అథర్వ కూడా తన మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి బూస్ట్ ని అందించాయి. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగినా సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎపిసోడ్స్ సినిమకు ఉపయోగపడ్డాయి. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ని చూసిన అనుభూతి కలుగుతుందని చెప్పవచ్చు.

ఈ సిన్మాకు వరుణ్ నటన, వేషధారణ, కామెడీ, పూజా హెగ్డే అందం (ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్) ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. 2.50 గంటల నిడివి గల ఈ సినిమాలో కొన్ని సాగదీసే సన్నివేశాలను తొలగిస్తే ఇంకా బాగుండేదని సినీ అభిమానులు చెబుతున్నారు. గద్దలకొండ గణేష్ 3/5 రెటింగ్ సాధించింది.