ఈ సినిమాకి నైజాం ఏరియాలో మంచి థియేటర్స్ దక్కాయి. అలానే ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడం వల్ల కూడా టికెట్ కౌంటర్ దగ్గర గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతుంది. ఒక్క నైజాంలోనే మూడు రోజులకు గాను నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇక ఇది మాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ అయినట్టు లేదు. అందుకే అక్కడ ఈ సినిమా కేవలం 1.30 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. దీంతో అక్కడ ఈ సినిమా ఫుల్‌రన్‌లో స్వల్పంగా నష్టాలు మిగిల్చేలా ఉంది. మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న వెస్ట్ గోదావరి, నెల్లూరు వరకు మాత్రం ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. సో, సైరా వచ్చేవరకు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏది థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ సినిమా కొనుకున్నవాళ్లందరికి కూడా మంచి లాభాలే అందించే అవకాశం ఉంది.
మొత్తానికి హరీష్ శంకర్ కష్టం, వరుణ్ తేజ్ నమ్మకం, కొత్త బ్యానర్ 14 రీల్స్ అన్నిటికి మంచి ఫేవరబుల్ గిఫ్ట్ అందించాడు గద్దలకొండ గణేష్.