“గేమ్ చేంజర్”.. ఆ వార్తల్లో నిజం లేదా?

“గేమ్ చేంజర్”.. ఆ వార్తల్లో నిజం లేదా?
Movie News

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది . అలాగే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు .

“గేమ్ చేంజర్”.. ఆ వార్తల్లో నిజం లేదా?
Ram Charan

దీనితో మూవీ పై అంచనాలు కూడా ముందు ఉన్న రేంజ్ లో కనిపించడం లేదు. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా కి నాన్ శాటిలైట్ హక్కులు రికార్డు ధర పలికాయి అని కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. కేవలం డిజిటల్ హక్కులే ఏకంగా 270 కోట్ల మేర డీల్ జరిగింది అని టాక్ వస్తోంది .

అయితే ఈ అంశంలో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఇంత మొత్తం అంటే ఇండియా లోనే ఏ మూవీ కి కూడా జరగని హైయెస్ట్ బిజినెస్ కానీ గేమ్ చేంజర్ కి మాత్రం అలాంటిది ఏది ఇంకా జరగలేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సో ప్రస్తుతానికి అవన్నీ అవాస్తవమే అని చెప్పుకోవాలి .