ప్రియుణ్ని చెట్టుకి కట్టేసి ప్రియురాలి పై.. గ్యాంగ్ రేప్

ఆడపిల్లలు ఎక్కడున్నా.. ఎవరితో ఉన్నా రక్షణ లేకుండా పోతోంది. సమాజంలో నిత్యం జరుగుతున్న ఘటనలతో యువత వణకిపోతుంది. మానవత్వం కూడా లేని సామూహిక అత్యాచారానికి పాల్పడుతోన్న ఘటనలు సమాజాన్ని భయపెడుతున్నాయి.

తాజాగా బంగ్లాదేశ్‌లోని చిట్టగ్యాంగ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత కాస్త ఆటవిడుపుగా.. సినిమాలు, షికార్లు, పార్కులు అంటూ అలా వెళ్లి కాలక్షేపం చేసేస్తుంది. అయితే ఉన్నఫలంగా ఈ మధ్య పార్క్‌కు వెళ్లి కామాంధుల చేతికి చిక్కారు. పార్క్‌కు వెళ్లి చెట్ల చాటున కబుర్లలో మునిగి ఉన్న సమయంలో ఆ జంట.. చీకటి పడిన విషయాన్ని కూడా మరిచిపోయారు.

ఆ జంట గాఢ ప్రేమను గమనించిన నలుగురు కామాంధులు.. బలవంతంగా ఇద్దరినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రియుడి పై ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి ఆ పక్కనే ఉన్న చెట్టుకు కట్టేశారు. అంతటితో ఆగలేదు.. అతడి ముందే ప్రియురాలిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అంతా పరారయ్యారు. ఊహించని ఘటనతో షాక్ తిన్న యువతి.. కాసేపటి తర్వాత తేరుకొని.. చెట్టుకు కట్టేసిన తన ప్రియుడి కట్లు విప్పింది. ఆ తర్వాత ఇద్దరూ సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. తర్వాత నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరాలో ఉన్న మరో వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.