భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా త్వరలో పదవీ బాధ్యతలు తీసుకోబోతున్న బెంగాల్ టైగర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి నుండి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కి రావలసిన వాటా గురించి ద్వజమెత్తాడు. మొత్తం అంతర్జాతీయక్రికెట్‌మండలి(ఐసీసీ)కి వచ్చే ఆదాయంలో బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)కి రావలసిన ఆదాయం రావాల్సిందే అని సందేశాన్ని పంపారు.
నూతన రెవెన్యూ పద్ధతి వల్ల భారత క్రికెట్ బోర్డు ఆదాయంలో రెండేళ్ల నుండి బీసీసీఐకి రావాల్సినంతగా డబ్బు రావడం లేదు, తక్కువ వాటా పొందుతుంది. ఐసీసీకి వచ్చే ఆదాయంలో భారత్ నుండే ఎక్కువ శాతం వెళ్తుంది. కాబట్టి దాని ప్రకారమే ఐసీసీ నుంచి బీసీసీఐకి పంచాల్సి ఉంది అని క్రికెట్ దాదా గంగూలీ తెలిపారు.