కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాజ్యసభలో ఆర్థిక సర్వే రిపోర్ట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతం ఉంటుందని ఆర్థిక సర్వే తన నివేదికలో అంచనా వేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి, మార్చి నెలల్లో ఆర్థిక ప్రగతి మందగించిందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 2019 సంవత్సరానికి ద్రవ్యలోటు 5.8 శాతం ఉన్నట్లు మంత్రి తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 2025 వరకు 5 ట్రిలియన్ల డాలర్లు అవుతుందని సర్వేలో తెలిపారు.