‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో చిన్న పాత్ర చేసి అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. తాజాగా ఈయన చేసిన గీత గోవిందం చిత్రంతో స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అతి కొద్ది మంది స్టార్ హీరోలు మాత్రమే ఇప్పటి వరకు వంద కోట్ల వసూళ్లను సాధించారు. ఆ జాబితాలో విజయ్ దేవరకొండ చేరిపోయాడు. గీత గోవిందం చిత్రం రెండు వారాలు పూర్తి అయ్యేప్పటికి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి రికార్డును సృష్టించింది. ఈజీగా 50 కోట్ల షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేయగలదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఆ అనుమానాలు బ్రేక్ అయ్యాయి.
‘గీత గోవిందం’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో విజయ్ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగి పోయింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టడంతో పాటు ఆన్‌లైన్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా పలురకాల రైట్స్‌తో మరింత లాభాన్ని నిర్మాతలకు తెచ్చి పెట్టింది. ఒక సినిమాకు ఈమద్య కాంలో 5 నుండి 10 కోట్ల లాభం రావడం అంటే గగనం. కాని ఈ చిత్రానికి ఏకంగా 30 నుండి 40 కోట్ల మేరకు నిర్మాతలకు లాభం దక్కబోతున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రా జాబితాలో చేరిపోయింది. రంగస్థలం, భరత్ అనే నేను చిత్రా తర్వాత గీత గోవిందం చిత్రం నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.