విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం చిన్న తుఫాన్‌లా మొదలై పెద్ద సునామిలా మారింది. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంకు 20 నుండి 25 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తే సూపర్ హిట్ అనుకున్నారు. కాని ఊహకు అందని రీతిలో ఏకంగా 50 కోట్లకు పైగా షేర్‌ను ఈ చిత్రం రాబట్టింది. మరి కొన్ని రోజుల పాటు ఈ సందడి కొనసాగనుంది కనుక ఖచ్చితంగా 60 కోట్ల ప్లస్ షేర్‌ను ఈ చిత్రం టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రం రాబడుతున్న వసూళ్లకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ట్రేడ్ వర్గాల వారు కూడా షాక్ అవుతున్నారు.
గీత గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్‌లో సూపర్ స్టార్ అయ్యాడు. మెగా, సూపర్, పవర్ స్టార్‌లకు మాత్రమే సాధ్యం అయిన రికార్డును అతి సులభంగా విజయ్ దేవరకొండ సాధించాడు. ఈ చిత్రంతో అల్లు అరవింద్‌కు తక్కువలో తక్కువ 50 కోట్లకు పైగా లాభాలు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కూడా ఇంత భారీగా లాభాలు రావు. ఇప్పటి వరకు మహేష్‌బాబు నటించిన ఏ చిత్రానికి కూడా ఇంతగా లాభం వచ్చి ఉండదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
కేవలం మహేష్‌బాబు మాత్రమే కాదు, ఏ స్టార్ హీరోల సినిమాలకు కూడా నిర్మాతలు ఇంతగా లాభాలు దక్కించుకుని ఉండరు. వసూళ్ల పరంగా వచ్చి ఉన్నా కూడా, అవి భారీ బడ్జెట్ చిత్రాలు అవ్వడం వల్ల లాభాలు తక్కువగా ఉంటాయి.