Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. బాయ్ ఫ్రెండ్ కు చివరగా ఫోన్ చేసి అతను చూస్తుండగానే ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది హనీషా చౌదరి అనే అమ్మాయి. అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తె హనీషా కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. హనీషా దక్షిణ్ పటేల్ అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ…హనీషా కాలేజ్ హాస్టల్ గదినుంచి అతనికి వీడియో కాల్ చేసింది.
అతను చూస్తుండగానే ఫ్యాన్ కు ఉరేసుకుంది. దీంతో దక్షిత్ పటేల్ వెంటనే హాస్టల్ గదికి చేరుకున్నాడు. లోపల గడియ పెట్టి ఉండడంతో తలుపులు బద్దలు కొట్టి తెరిచాడు. ఫ్యాన్ కు ఉరేసుకున్న హనీషాను ఆమె స్నేహితురాలి సాయంతో కొంపల్లిలోని సిగ్మా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే హనీషా ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనీషా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.