తండ్రి పాత్రలో ఎన్టీఆర్ కి డబల్ ప్రమోషన్.

Jr NTR is Going to be a Father Again
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్ సినిమాల్లో తండ్రి పాత్ర వేసింది లేదు. ఒక్క ఆంధ్రా వాలా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఎన్టీఆర్ కి వెండితెర తండ్రి పాత్రను ఎంజాయ్ చేయలేకపోయారు. నిజ జీవితంలో ఆ తండ్రి పాత్రను ఎన్టీఆర్ ఎంతగా ఎంజాయ్ చేశారో వేరే చెప్పక్కర్లేదు. కొడుకు అభయరామ్ పుట్టిన దగ్గర నుంచి అతని చుట్టూనే తిరిగాడు ఎన్టీఆర్ . ఎవరు కదిలించినా అభయ్ కబుర్లే చెప్పాడు. తండ్రి అయ్యాక తనలో బాగా పరిణితి వచ్చిందని ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పారు కూడా. ఇప్పుడు ఇంకో చిన్నారి గురించి కూడా ఎన్టీఆర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ చిన్నారి ఇంకెవరో కాదు. తనకు పుట్టబోయే బిడ్డ. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి గర్భవతి అని తెలుస్తోంది. ఇంకొన్ని నెలల్లో డెలివరీ డేట్ ఉందట.

కెరీర్ పరంగా పీక్ స్టేజి లో వున్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ , రాజమౌళి లాంటి దర్శకుల సినిమాలు చేస్తున్న సమయంలోనే రెండో సారి తండ్రి కాబోతున్నారు. ఎన్టీఆర్ మనసు ఎరిగిన వాళ్ళు ఈసారి అమ్మాయి పుడితే బాగుండని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.