కోపమొచ్చి గర్ల్ ఫ్రెండ్ ని అమ్మకానికి పెట్టాడు…!

GirlFriend For Sale In Ebay

ఒక్కోసారి కొందరి ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉంటుందో ఊహకు కూడా అందదు. ప్రియురాలి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వ్యక్తి చేసిన వింత చేష్ట వింటే దిమ్మతిరిగి బొమ్మ కనపడల్సిందే.గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ అయితే ఆమెతో కొద్ది రోజులు మాట్లాడటం మానేయడమో.. పూర్తిగా దూరంగా ఉండటమో చేస్తారు. కానీ అందరిలా చేస్తే ఏముంటుందనుకున్నాడో ఏమో కానీ ఓ వ్యక్తి ఏకంగా గర్ల్‌ఫ్రెండ్‌నే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. ఈ విచిత్ర ఘటన యూకేలో జరిగింది. డేల్‌ లీక్స్‌ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ కెల్లీతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఇద్దరి మధ్య చిన్న గొడవైంది. దీంతో కోపంగా ఇంటికొచ్చేసిన డేల్‌ ఈబేలో కెల్లీ ఫొటోను అప్‌లోడ్‌ చేసి వేలానికి పెట్టాడు.

girl-frnd-sale
తన గర్ల్‌ఫ్రెండ్‌ను కారుతో పోలుస్తూ ఫొటో కింద వెరైటీగా వివరణ ఇచ్చాడు. ఇది కాస్త వైరల్‌గా మారి 24 గంటల్లోనే 81 వేల మందిని ఆకర్శించింది. వంద వరకు బిడ్లు నమోదయ్యాయి. ఆమె కోసం ఏకంగా రూ.68 లక్షలు ఇస్తానంటూ ఒకరు ముందుకొచ్చారు. ఆలస్యంగా గుర్తించిన ఈబే ఆ ప్రకటనను తొలగించింది. బాయ్‌ఫ్రెండ్‌ తనను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయాన్ని తెలుసుకున్న కెల్లీ సరదాగా నవ్వుకుంది. కెల్లీని డ్రైవ్‌కు తీసుకెళ్తామంటూ అతడి ఫోన్‌కు పెద్ద సంఖ్యలో సందేశాలు వచ్చాయి.

girlfriend