తెలంగాణలోని సిద్దిపేటు త్వరలో గోదావరి జలాలు రానున్నాయి. దీంతో సిద్దిపేటకు గోదావరి జలాలు రానుండటంతో తన జన్మ ధన్యమైందని అన్నారు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు. గతంలో జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలు విపరీతంగా ఉండేవని… ఆ సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించినప్పుడు వారి గోసలు విని కన్నీరు వచ్చేదని అన్నారు మంత్రి హరీష్ రావు. అలాగే.. ఇప్పుడు గోదావరి జలాలు సిద్దిపేట రానుండటంతో ఆ బాధలు దూరమయ్యే సమయం ఆసన్నమైందని అన్నారు.
అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట నియోజక వర్గం పరిధిలో నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయంలోకి నీటిని రిలీజ్ చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారని ఆయన అన్నారు. దీంతో సిద్దిపేట అర్బన్, సంగనూరు మండల పరిధిలోని రంగనాయక సాగర్ కుడి ప్రధాన కాలువ, ఎడమ, పిల్లకాలువల వెంట స్వయంగా ఆయన పర్యటించారు. ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, తూముల ద్వారా చిన్ననీటి వనరులను నింపాలని మంత్రి వివరించారు. అంతేకాకుండా తనకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని స్పష్టం చేశారు.