గోల్డెన్ బాబాగా పేరు పొందిన సుధీర్ కుమార్ మక్కర్ ఇకలేరు. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉంటున్న ఆయన… ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. సుమారు సంవత్సరం నుంచి చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మృతి చెందారు.