ఏపీ రైతులకు గుడ్ న్యూస్..శ‌న‌గ విత్త‌నాల ఉచిత పంపిణీ

Good news for AP farmers..Free distribution of gram seeds
Good news for AP farmers..Free distribution of gram seeds

ఏపీ రైతులకు గుడ్ న్యూస్..శ‌న‌గ విత్త‌నాల ఉచిత పంపిణీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప్రకటించారు. ఈ దేశంలోనే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉండ‌టంలో ఆద‌ర్శంగా ఉంద‌ని తెలిపారు. మిచౌంగ్ తుపాను ధాటికి దెబ్బ‌తిన్న పంట పొలాల‌ను శుక్ర‌వారం ఏపీ రాష్ట్ర‌ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప‌రిశీలించారు.

నాదెండ్ల మండ‌లం బుక్కాపురం, తూబాడు,గున్నవారిపాలెం, రాజుగారిపాలెం తదిత‌ర గ్రామాల ప‌రిధిలో పంట పొలాల‌ను మంత్రి రజినీ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంచి మొల‌క ద‌శ‌లో శ‌న‌గ పంట ఉండ‌గానే భారీ వ‌ర్షాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. పంట మొత్తం దెబ్బ‌తిన్న‌ద‌ని చెప్పారు. బాధిత రైతులంద‌రికీ వారం రోజుల్లో మ‌ళ్లీ ఉచితంగా శ‌నగ విత్త‌నాలు పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంద‌ని చెప్పారు. ప‌త్తి, మిర్చి.. ఇత‌ర పంట‌లకు వాటిల్లిన న‌ష్టాన్ని కూడా అధికారులు అంచనావేస్తున్నార‌ని పేర్కొన్నారు.