ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అలర్ట్. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఏపీలో ఉన్న యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది జగన్ సర్కార్. ఏకంగా 18 యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది జగన్ సర్కార్.
17 ఏళ్ళ తరువాత యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ జరుగుతోంది. 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక నేటి నుంచి ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్లో దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉండనుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజ్ ఉంటుందని ప్రకటన చేసింది జగన్ సర్కార్.