ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరా కానుకగా జీతాలు పెంపు..!

Good news for government employees.. Salary hike as Dussehra gift..!
Good news for government employees.. Salary hike as Dussehra gift..!

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జులైలోనే డీఏ పెరగాల్సి ఉంది. కానీ.. రెండో డీఏ ఇప్పటి వరకు పెరగలేదు.. ప్రతి ఏడాది రెండు సార్లు డీఏ పెరుగుతుంది. జనవరి, జులై రెండు సార్లు డీఏ పెరుగుతుంది. ఈ సంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. ఆ తర్వాత డీఏ జులైలో పెరగాల్సి ఉంది. కానీ.. ఇంకా జులైలో పెరగలేదు. దసరా, దీపావళి సందర్భంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఊరిస్తూ, నిరాశను కలిగిస్తుంది..అయితే, కేంద్రం డీఏను పెంచకముందే తెలంగాణ ప్రభుత్వం డీఏ పెంపును తాజాగా ప్రకటించింది. దసరా కానుకగా ఫెస్టివల్ బొనాంజా పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపును ప్రకటించింది.

ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండి వీసీ సజ్జనార్ డీఏ పెంపును ప్రకటించారు. 4.8 శాతం డీఏను పెంచుతున్నట్టు తాజాగా వెల్లడించారు. డీఏ పెంపు ఈ సంవత్సరం జులైనుం చి అమలులోకి రానుం ది. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ జీతంతో పాటే డీఏ కూడా పెరిగి.. అక్టోబర్ జీతంతో రానుంది. 2019 నుంచి ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 9డీఏలను ఇన్‌స్టాల్‌మెంట్స్ లో ఇస్తున్నారు.ఇకపోతే అక్టోబర్ జీతంతో పెరిగిన డీఏను కూడా యాడ్ చేసి ఉద్యోగులకు ఇస్తున్నట్లు తెలిపారు.. ఇక కేంద్రం డీఏ పెంపుపై ప్రకటన ఎప్పు డు వస్తుం దా అని అం తా ఎదురు చూస్తున్నా రు.దసరా తర్వా త దీపావళికి కేం ద్ర ప్రభుత్వ డీఏ పెంపు ప్రకటనను వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఏ పెంపుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం డీఏ 42 శాతం గా ఉంది.. ఇక తర్వాత 3శాతం పెరుగుతుందా.. లేక 4% శాతం పెరుగుతుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు..