ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేన అభిమానులకి మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో “గాజు గ్లాసు” గుర్తుని ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు కూడా రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు మాత్రం కచ్చితంగా గెలవాలి. ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ గా తీరిపోయింది.
త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వనుంది. కాగా, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని చూసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి, కీలకమైన మంత్రి పదవి వస్తుందని తెలుస్తుంది . అయితే జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో మాత్రం ఈ అంశం నిరాశ కనిపిస్తుంది . పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.