దక్షిణ మధ్య రైల్వే ఓనమ్ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. పది రోజుల పాటు జరిగే పండగ సందర్భంగా సికింద్రాబాద్ – కొల్లాం మధ్య ప్రత్యేకంగా సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25న సికింద్రాబాద్ (07199) నుంచి రైలు సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రికి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు రాత్రి 7 గంటలకు బయల్దేరి… మరనాడు రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, చిత్తాపూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాలో ఆగుతాయి. , ఎర్నాకులం రైలు , కొట్టాయం, చెంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెల్లికర మరియు కాయంకులం స్టేషన్లు, సికింద్రాబాద్ మరియు కొల్లం మార్గంలో ఆగుతాయి.