తెలంగాణ ప్రభుత్వ అధికారులకు గుడ్ న్యూస్.. విడుదలకు ఈసీ ఫర్మిషన్

Good news for Telangana government officials.. EC permission for release
Good news for Telangana government officials.. EC permission for release

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించారు. అయితే అక్టోబర్ నెలలోనే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో కొన్నింటికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికల వేళ ఈసీ లబ్ది పొందేందుకు ప్రభుత్వం కొన్నింటిని అమలు చేస్తుందని భావించి అన్నింటిని నిలిపివేయించింది. తాజాగా ఎన్నికలు జరిగినప్పటికీ కోడ్ మాత్రం ఫలితాలు వచ్చేంత వరకు అమలు లోనే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు DA పెంచుతూ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న DA ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసిన విషయము తెలిసింది. అయితే మూడు DA లను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వము లేక రాసింది. దీనిపై తాజాగా స్పందించిన ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లించేందుకు అనుమతిని ఇచ్చింది. ఉద్యోగులకు అక్టోబర్ నెల నుంచి DA చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరము లేదని ఈసీ తేల్చి చెప్పింది.