ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపు “జగనన్న చేదోడు పథకం” నిధులు విడుదల

Good news for AP people… 5 lakh more houses for Sankranti
Good news for AP people… 5 lakh more houses for Sankranti

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించింది జగన్‌ సర్కార్‌. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ నెల 19న అంటే రేపు సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఇందులో భాగంగానే రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి..ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం తాడేపల్లికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుగు ప్రయాణం కానున్నారు.

ఇక అటు గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండటంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి వార్డులోనూ హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో మరింత మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 35. 11 లక్షల మంది ఉచితంగా వైద్యం పొందగా… మెరుగైన చికిత్స కోసం 61, 971 మందిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు డాక్టర్లు రిఫర్ చేశారు.