పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “దేవర” కోసం అందరికి తెలిసిందే. మరి దీనిపై ఎన్నో అంచనాలు ఉండగా ఈ మే లో అయితే అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు . అయితే ఈ మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఇప్పుడు వరకు భారీ మూవీ వార్ 2 లో తారక్ బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మేకర్స్ దేవర షూట్ ను విశాఖపట్నం లో ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఈ షూట్ అంతా ఎన్టీఆర్ లేకుండా తీసే సన్నివేశాలు అన్నట్లు తెలుస్తుంది . ఇవి సేఫ్ సైడ్ గా తీస్తున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ మూవీ లో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో మూవీ ని నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.