దసరా పండుగకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన శుభవార్త చెప్పింది. హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15% అని ప్రకటించింది. హోమ్ లోన్ ఇండస్ట్రీలోనే ఇది అతి తక్కువ వడ్డీ రేటు. ఇప్పటి వరకు ఏ బ్యాంకు, ఏ సంస్థ హోమ్ లోన్‌కు ఇంత తక్కువ వడ్డీ ఆఫర్ చేయలేదు. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ సిస్టమ్ పేరుతో ఈ వడ్డీ రేట్లను ప్రకటించింది ఎస్బీఐ. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకునేవాళ్లు తక్కువగా 8.15% వడ్డీ రేటుకే ఇంటి రుణం పొందొచ్చు.