ప్రజలకి శుభ వార్త చెప్పిన ఏపీ సర్కార్

ప్రజలకి శుభ వార్త చెప్పిన ఏపీ సర్కార్

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. అయితే కరోనాను అడ్డుకునేందుకు జరుగుతున్న యుద్ధంలో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తీవ్రంగా పోరాడుతున్నారు. అయితే ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా కరోనాపై జరుగుతున్న పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. 2 లక్షల 60 వేల మంది ఇంటింటికి వెళ్ళి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహిస్తుండడం, వారికి రేషన్, ఫించన్ వంటి వాటిని ఇంటికి వెళ్ళి అందిస్తున్న నేపధ్యంలో కరోనా బాధితులను తాకితే వీరు కూడా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది.

అయితే దీనిని దృష్టిలో ఉంచుకున్న ఏపీ సర్కార్ గ్రామ, వార్డు వాలంటీర్లందరికి ఆరోగ్య భీమాను ప్రకటించింది. వీరందరికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని వర్తింపజేస్తూ ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ఇకపై గ్రామ, వార్డు వాలంటీర్లకు రూ.50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది.